Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల అరెస్టు

దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల అరెస్టు

దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల అరెస్టు

 

ఎఫ్ ఐ ఆర్. No. 138/2025 u/s 331(4),305(a) బి ఎం ఎస్ ఆఫ్ సాలూరు పిఎస్
జరిగిన తేదీ :09.11.2025
సమయం* :23:45 గంటలు
బంగారమ్మపేట, సాలూరు టౌన్, పార్వతీపురం మాన్యం జిల్లా
ఎఫ్ఐఆర్ రిపోర్ట్ 10.11.2025 ది, సమయం :10:00 గంటలు, నమోదు కాబడింది అని తెలిపారు. సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లోస్వాధీనం చేసిన సొత్తు వివరాలు 32 వేల రూపాయలు,6.5 గ్రాముల బంగారు వస్తువులు
మొత్తం విలువ సుమారుగా 50 వేల రూపాయలు అరెస్టు కాబడిన ముద్దాయిల వివరాలు
బొత్స నవీన్ సన్నాఫ్ వెంకట్రావు (19)కోడూరు కార్తీక్ సన్నాఫ్ శ్రీను (18)మడుగులు వంశీ సన్నాఫ్ లేట్ రాజు(18)పై ముగ్గురు నివాసం బంగారమ్మ కాలనీ, సాలూరు టౌన్, పార్వతీపురం మన్యం జిల్లా అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు.
తే. 10.11.2025. దిన ఫిర్యాది అయన దేవిపల్లి వెంకటరావు s/o సత్యామ్నారాయణ, వయసు 57,బంగారమ్మపేట, సాలూరు టౌన్ వారు ఇచ్చిన రిపోర్ట్ అంశాలు అనగా తేదీ. 07.11.2025.న తన కూతురు నివాసం ఉన్న పెందుర్తి విశాఖపట్నం సిటీ నకు ఐయ్యప్ప పూజ కార్యక్రమం కొరకు తన భార్య లక్ష్మితో కలిసి వెళ్లినట్లు తెలిపారు. తే. 09.11.2025 ది న సుమారు రాత్రి 12 గంటలకు తన ప్రక్కింటి నివాస అయినా బూరాడ శేఖర్ ఫోన్ చేసి తన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో దొంగలు పడినట్లు చెప్పినాడు అంతట ఫిర్యాది వచ్చి బీరువా తనిఖీ చేయగా అందులో ఉండవలసిన ఏడు గ్రాముల బంగారం వస్తువులు మరియు 37 వేల రూపాయల నగదు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదు ఇచ్చినారను తెలిపారు. కేసు దర్యాప్తు లో భాగంగా ఈ దినం
తే 13.11.2025 దిన మధ్యాహ్నం 01:00 గంటలకు సాలూరు టౌన్ నుండి జీగిరం వైపు పోవు మెయిన్ రోడ్డు ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా AP40EV3331 గల స్కూటీతో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగిందని అన్నారు. వారిని పట్టుకుని విచారించగా నిందితులు ముగ్గురు చెడు అలవాట్లకి బానిసగా మారి దొంగతనం చేద్దామని ఉద్దేశంతో తే 9/11/2025 దిన రాత్రి 11:30 గంటలకు బంగారమ్మ పేట లో తాళం వేసి ఉన్న ఇంటి కి వెళ్లి వారి వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్ మరియు జాకి రాడ్ ల సహాయంతో ఇంటీ తాళాలు మరియు బీరువాను పగలగొట్టి దొంగతనం చేసినట్లు తెలిపారు.అంతట వారి వద్ద ఉన్న 32 వేల నగదు మరియు 6.5 గ్రాముల బంగారం స్వాధీనపర్చుకోవడం అయినది తెలియజేశారు. దొంగతనానికి పాల్పడిన పై ముగ్గురిని సాలూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగినది. సాలూరు పట్టణంలో యువత శాంతిభద్రతకు, ప్రజల ధన మాన ప్రాణాలకు హానికలిగింటే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టమైన క్రిమినల్ కేసులు, రౌడీ, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తామని తెలియజేసారు.వారి ని హెచ్చరించడం జరిగినది అని తెలిపారు. (Story:దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల అరెస్టు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!