Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి

న్యూస్ తెలుగు/సాలూరు : కుటమీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకొని, పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు. బుధవారం రాష్ట్ర వైయస్సార్ పార్టీ పిలుపుమేరకు సాలూరు నియోజకవర్గం పరిధిలో గల నియోజకవర్గ కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలతో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వకుండా ఉండాలని కోరుతూ భారీ ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అఫీషియల్ కాలనీలో ఉన్న ఆయన స్వగృహం నుండి మెయిన్ రోడ్డు వరకు చేసిన అనంతరం. తహసిల్దార్ కార్యాలయమునకు చేరుకొని తాసిల్దార్ నేలకంఠ రావు కు వినతి పత్రం ఇచ్చారు. తరువాత బోసు బొమ్మ జంక్షన్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి, సుభాష్ చంద్రబోస్ కు, పూలమాల లేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే దిక్కు లేకుండా పోయిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసి ప్రతి పేదవారికి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి ఉండేది అని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని క్రమంగా ఎత్తివేసి పేదవారికి వైద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నారని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మొత్తం 17 మెడికల్ కాలేజీలు తెచ్చి గవర్నమెంట్ ఆధీనంలో నిర్మాణాలు జరిగాయని చెప్పారు. ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా బడా కాంట్రాక్టర్లకు ప్రైవేటు వ్యాపారస్తులకు ఈ హాస్పిటల్ ఇవ్వడానికి పూనుకుందని తెలియజేశారు..దీనివలన సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులో లేకుండా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ మానవతా దుఃఖ పదంతో ఆలోచించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీనివాసులు నాయుడు, సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, సాలూరు మండల అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీను, వైసీపీ నాయకులు, దండి శ్రీనివాసరావు, మామిడి రంగు నాయుడు, రెడ్డి సురేష్, రెడ్డి సన్యాసి అప్పలనాయుడు, బి ప్రమీల, రెడ్డి పద్మావతి, గిరి రఘు, చెల్లూరి సీతారామకృష్ణ వైయస్సార్ పార్టీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!