పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన కలియుగదైవం కురుమూర్తి స్వామి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో అధికారులు,అర్చకులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ఆరాధ్యదైవం కురుమూర్తి స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ హయాములో ఆలయ అభివృద్ధి కోసం కృషి చేశారని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మాజీ మంత్రి వెంట మిత్రులు,బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. (Story:పేదల తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన కలియుగదైవం కురుమూర్తి స్వామి)

