రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు మండలం తుమ్మల గ్రామం సమీపంలో నేషనల్ హైవేఫై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. చింతూరు ఎస్సై రమేష్ కదనం ప్రకారం
మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో తుమ్మల గ్రామంలో రోడ్డుపై నడిచి వెళుతున్న బాటసారిని చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్తున్న మడకం శివకృష్ణ అను వ్యక్తి యూనికాన్ బైక్ పై వెళుతూ వెనుకవైపు నుండి ఢీ కొట్టి, అదుపుతప్పి పడిపోవడం వలన బండి నడుపుతున్న తెలంగాణ రాష్ట్రం దుమ్ముగూడెం మండలం చెరుపల్లికి చెందిన శివకృష్ణ(31) తలకు బలమైన గాయం అవటం వలన మరణించడం జరిగిందని, బాటసారితోపాటు బండిపై ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడటం జరిగిందన్నారు. ఈ రోడ్డు ప్రమాదంపై చింతూరు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.(Story:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి)
