Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ ఆర్టీసీ డిఎం మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికుల ఆందోళన

వినుకొండ ఆర్టీసీ డిఎం మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికుల ఆందోళన

0

వినుకొండ ఆర్టీసీ డిఎం మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికుల ఆందోళన

ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన

న్యూస్ తెలుగు / వినుకొండ : ఏపీఎస్ ఆర్టీసీ వినుకొండ డిపో మేనేజర్ మొండి వైఖరి, ఏకపక్ష నిర్ణయాలు, యూనియన్ పట్ల అవహేళనగా మాట్లాడటం తదితర అంశాలపై గత రెండు రోజుల నుండి ఎర్ర బాడ్జెస్ తో నిరసన తెలిపారు. అలాగే మంగళవారం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. డిపో మేనేజర్ తన నిరంకుశ ధోరణితో ఉద్యోగుల సమస్యల ను పెడచెవిన పెడుతున్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయుటలో కీలకమైన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లకు చిన్న చిన్న పొరపాట్లకు పనిష్మెంట్ వద్దని 1/2019 సర్కులర్ ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా పనిష్మెంట్ ఇవ్వడం, కాలం చెల్లిన బస్సులను రోడ్డు మీదకు పంపిస్తూ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి ఆ బస్సులు మార్గమధ్యలో ఆగిపోతే మెకానికులకు పనిష్మెంట్ ఇవ్వడం, 2024లో టిమ్ డ్యామేజ్ జరిగిందని భావించి ఇప్పుడు డ్రైవర్లకు, కండక్టర్లకు డ్యామేజీ రికవరీ పెట్టుట, గ్యారేజీ నందు విధులు ముగించుకుని కూర్చున్న సిబ్బందిని పనిచేయడం లేదని విధులకు దూరంగా పెట్టడం, ప్రమోషన్ కోసం ఎదురుచూసి అవి రాకపోవడం వలన ఓడిగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తక్కువగా, బానిసలుగా చూడటం, ఇదేంటని అడగడానికి వెళ్లిన యూనియన్ ప్రతినిధులను హేళనగా చిన్న చూపు చూడటం, డిపో అభివృద్ధిలో భాగస్వామ్యం అయినటువంటి యూనియన్ ను తక్కువగా చూడటం, మొదలగు అపరిష్కృత సమస్యలపై గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జోనల్ అసిస్టెంట్ సెక్రటరీ కే. హరిబాబు, పల్నాడు జిల్లా కోశాధికారి ఎం. పాపయ్య, అధ్యక్షులు విన్సెంట్, కార్యదర్శి సాంబశివరావు, గ్యారేజీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎస్ కే జానీ, మధుబాబు, దిబ్బయ్య, బాజీ, సైదులు, ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, పి శ్రీనివాసరావు, లతోపాటు మరో వంద మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు.(Story:వినుకొండ ఆర్టీసీ డిఎం మొండి వైఖరిని నిరసిస్తూ కార్మికుల ఆందోళన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version