వినుకొండ సబ్ జైలును సందర్శించిన జిల్లా లీగల్ సెల్ అథారిటీ
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ సబ్ జైల్ ను గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్ ఆకస్మిక తనిఖీ చేశారు. సబ్ జైలు ను సందర్శించి ఖైదీలతో సమావేశం నిర్వహించి అక్కడ ఉన్న ఖైదీ లను వారి సమస్యలను ప్రశ్నించి వారి ఆరోగ్య పరిస్థితులను, జైలులో అందిస్తున్న భోజన సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలన్నారు. జైలులో అందిస్తున్న మెను ను పరిశీలించారు. వైద్యం, భోజనం,తదితర విషయాల గురించి ఖైదీ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంట గది నీ, స్టోర్ రూం నీ తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. న్యాయ వాది నీ ఏర్పాటు చేసుకోలేని వారికి న్యాయవాది నీ నియమిస్తామని, ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే తెలపలన్నారు. ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని అన్నారు. జైలు ప్రంగాణం ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ తో పాటు ప్యానల్ అడ్వకేట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ లోక్ అదాలత్ సిబ్బంది, జైలు సిబ్బంది, పాల్గొన్నారు. (Story:వినుకొండ సబ్ జైలును సందర్శించిన జిల్లా లీగల్ సెల్ అథారిటీ)
