ఒరిస్సా ఆర్ టి సి బస్సు దగ్ధం
ఘటనా స్థలాన్ని సందర్శించిన మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్
ఇంజిన్‌లో సంభవించిన లోపంవల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఆర్ టి సి బస్సు దగ్దమైంది
న్యూస్ తెలుగు /సాలూరు : సుంకి-సాలూర్ ఘాట్ రోడ్డు, పాచిపెంట మండలం, రోడ్డవలస గ్రామ జంక్షన్ దగ్గర అగ్నిప్రమాదం జరిగి ఒడిస్సా ఆర్ టి సి బస్సు దగ్దమైన ఘటనా స్థలాన్ని సందర్శించి,పరిశీలించారు.
06.11.2025 ఉదయం 5 గంటలకు ఒడిశా రాష్ట్ర ఆర్ టీ సి బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ OD 10 S 6754 విజయనగరం నుండి ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ 10 మంది ప్రయాణికులను ఎక్కించుకొని, సుమారు 07.15 గంటల నుండి 07.30 గంటల మధ్య, ఆ బస్సు సుంకి-సాలూర్ ఘాట్ రోడ్డు, పాచిపెంట మండలం, రోడ్డవలస గ్రామ జంక్షన్ దరి వెళుతుండగా, బస్సు ఇంజిన్‌లో లోపం సంభవించగా, గమనించిన డ్రైవర్ బస్సును ఆపి ఇంజిన్‌ను తనిఖీ చేశాడు. తనిఖీ చేస్తుండగా దురదృష్టవశాత్తు ఇంజిన్ నుండి మంటలు చెలరేగాయి, వెంటనే బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ అప్రమత్తమై ప్రయాణికులను అప్రమత్తం చేసి, ప్రయాణికులందరినీ సురక్షితంగా బస్సు నుండి కిందకు దింపారు.
బస్సు డ్రైవర్ పాచిపెంట పోలీస్ వారికీ సమాచారం తెలుపగా, సమాచారం అందిన వెంటనే, పి.కోనవలస గ్రామ పోలీసు చెక్ పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న పాచిపెంట పోలీసు ఎస్ ఐ మరియు సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, సహాయం చేసి, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వెనువెంటనే సాలూర్ అగ్నిమాపక అధికారి మరియు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి, మంటలను సకాలంలో ఆపారు. ఈ విషయం తెలియగానే పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ ఒడిస్సా ఆర్ టి సి బస్సు దగ్దమైన ఘటనా స్థలాన్ని చేరుకొని, ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులని ఆదేశించారు. ప్రాధమిక దర్యాప్తులో ఇంజన్ లో సంభవించిన మంటలవలన ప్రమాదం సంభవించిందని, కేసు నమోదు చేయడమైనదని, డ్రైవర్ సమయస్పూర్తిగా వ్యవరించడం వలన ప్రయాణికులకి ఎవరికీ ఎటువంటి అపాయం జరలేదని, ప్రయాణికులు అందరు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారని ఆయన తెలియజేసారు..
ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ తో పాటుగా సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్, జిల్లా అగ్నిమాపక అధికారి, జిల్లా రవాణా శాఖ అధికారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story: ఒరిస్సా ఆర్ టి సి బస్సు దగ్ధం)

