అంబరాన్ని తాకిన నందమ్మ సంబరాలు
న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు వడ్డివీధిలో “నందెమ్మ అనుపోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఊరేగింపు స్థానిక వడ్డీ వీధి జంక్షన్ నుంచి, వెంకటేశ్వర డీలక్స్ నుండి మెయిన్ గుండా సాగింది. బల్ల వేసాలు, పులి వేషాలు, బిందెల డాన్సులు, కోలాటాలు, కత్తి సాము, కన్నుల మిరిమెట్లు గోలిపే బాణసంచా కాల్చారు. ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు మజ్జి చిరంజీవి. మజ్జి నటరాజ్, మజ్జి అనిల్, సీఎం శ్రీను, సాలూరు వ్యవసాయ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మక్కువ మండల అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్ నాయుడు, అఖ్యాన అప్పారావు, కునిశెట్టి బీమా తదితరులు పాల్గొన్నారు (Story:అంబరాన్ని తాకిన నందమ్మ సంబరాలు)

