గంజాయి గూర్చి సమాచారం ఇవ్వండి : ఎస్సై రమేష్
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండలంలో గంజాయి రవాణా దారులు ఎవరన్నా ఉంటే తమకు తెలియజేయాలని ఎస్సై పి రమేష్ కోరారు. చింతూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి, ఆశా వర్కర్లకు గురువారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణంలో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి దాని చెడు ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి రవాణా చేయటం, పెంచడం, సేవించడం నేరమని తెలిపారు. యువత గంజాయి సేవించడం, రవాణా చేసి కేసుల కేసుల పాలై, జైల్లో మగ్గుతున్నారని తమ గ్రామాల్లోని యువకులకు అవగాహన కల్పించాలని, తమ పిల్లల్ని కూడా గంజాయి జోలికి వెళ్లకుండా చూడాలని ఆశ వర్కర్లను, అంగన్వాడి వర్కర్లను కోరారు. గంజాయి తో ప్రమేయం ఉన్నవారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని కావున తమ యువతను పిల్లలను కాపాడే బాధ్యత చూడాలని కోరారు. అలాగే తమ గ్రామాల్లో గంజాయి రవాణా చేసేవారు ఎవరైనా ఉంటే తమకు తెలపాలని, తెలిపిన వారి పేర్లు గొప్యం గా ఉంచుతామని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు (Story:గంజాయి గూర్చి సమాచారం ఇవ్వండి : ఎస్సై రమేష్)

