శ్రీ భ్రమర జెనిత్ సిటీ పై అధికారుల విచారణ…
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ సమీపంలో శ్రీ భ్రమర జెనిత్ సిటీ సమస్యలపై అధికారుల విచారణ జరిపారు. చీకటి గలపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ భ్రమర జెనిత్ సిటీ సమస్యలపై గురువారం అధికారుల బృందం విచారణ జరిపింది. డివిజనల్ పంచాయతీ అధికారి వి.వి.యం. లక్ష్మణ్‌రావు, ఈఓ పీఆర్డీ జి. సుందర్‌రెడ్డి, జెనిత్ సిటీ అసోసియేషన్ అధ్యక్షుడు మేడ వెంకట అశోక్, కార్యదర్శి బీజం కృష్ణారెడ్డి తదితర సభ్యులు పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించ, ప్రాంతంలో ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం వారు జెనిత్ సిటీలో కూలిన గోడలు, ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు, విద్యుత్ కనెక్షన్ లేని ఓవర్ హెడ్ ట్యాంక్ మోటర్లు మరియు ఉపయోగించకుండా వదిలేసిన కమ్యూనిటీ భవనం స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. గత నెల 18వ తేదీన జెనిత్ సిటీ అసోసియేషన్ సభ్యులు టిడిపి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సమర్పించిన ఫిర్యాదుకు అనుగుణంగా ఈ విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. (Story:శ్రీ భ్రమర జెనిత్ సిటీ పై అధికారుల విచారణ…)

