జెన్కో సి ఈ ని కలిసిన జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు మండల టిడిపి అధ్యక్షులు మహమ్మద్ జమాల్ ఖాన్ లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ముఖ్య ఇంజనీర్ రాజారావు ను మోతుగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై విన్నవించడం జరిగినది ఏపీ జెన్కోలో పనిచేస్తున్నటువంటి గుత్తేదార్ కార్మికులకు అద్దెప్రాతిపాదికన నివాస గృహాలు కేటాయించాలని అదేవిధంగా ఐదు ఆరు యూనిట్లు కన్స్ట్రక్షన్ లో భాగంగా లోకల్ గా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కోరడం జరిగినది.దానికి స్పందించిన ముఖ్య ఇంజనీర్ తప్పకుండా తాము అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జమాల్ ఖాన్ చేస్తున్నటువంటి సామాజిక సేవను గుర్తించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్న కామేశ్వర రావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ వరప్రసాద్ పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా చాలాకాలంగా అసంపూర్తిగా మిగిలి ఉన్న అయ్యప్ప స్వాముల నివాస దీక్షా శిబిరాన్ని సందర్శించి అయ్యప్ప స్వాముల అభ్యర్థన మేరకు ఆ శిభరాన్ని పూర్తి చేసుకొనుటకు సదరు జమాల్ ఖాన్ లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయానికి మంచినీళ్లు బోరుబావి కూడా వేయిస్తామని హామీ ఇచ్చారు.(Story:జెన్కో సి ఈ ని కలిసిన జమాల్ ఖాన్)

