ఈటీవీ రిపోర్టర్ శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్ నందు నివాసముంటున్న ఈటీవీ రిపోర్టర్ శ్రీనివాసరావు తండ్రి ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మంగళవారం వారి నివాసానికి వెళ్లారు. రిపోర్టర్ శ్రీనివాసరావుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.(Story: ఈటీవీ రిపోర్టర్ శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ )

