తుఫాను బాదిత కుటుంబాలకు అండగా నిలిచిన ఎన్డీఏ ప్రభుత్వం
– ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న సీఎం చంద్రబాబు..
– పునరావాస కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు..
న్యూస్ తెలుగు / వినుకొండ : మొంధా తుఫాన్ వలన రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు పర్యవేక్షణలో ప్రజలను కాపాడారని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో తుఫాన్ వరద బాధితుల ప్రభావాస కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం బాదిత కుటుంబాలకు అందించిన బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు సాయాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు నుండి గరిష్టంగా 3000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందించి ఆదుకుంటుందన్నారు. తుఫాను సమయంలో ముంపు, వరద ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరద బాధితులను ఆదుకోవడతోపాటు సహాయం అందించడం జరిగిందన్నారు. 554 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 10 వేలమంది వరద బాధితులకు ఆశ్రయం కల్పించి కూటమి ప్రభుత్వం ఆదుకుందన్నారు. తుఫాన్ కారణంగా విద్యుత్తు పోల్స్ నేలకు ఒరిగి, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని మరమ్మత్తులకు అధికారులను ఆదేశించగానే యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరమ్మత్తులు చేయించి విద్యుత్ సరఫరా చేయడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో క్షమించిన పరిశుద్ధాన్ని మెరుగుపరిచి, ప్రజలకు సీజన్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇప్పించి, ప్రభుత్వం ఇంటి నిర్మాణం కూడా చేపడుతుందని అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తుఫాను ప్రభావంతో కూలిపోయిన ఇంటి లబ్ధిదారులకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. గత వైసిపి ప్రభుత్వం విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలను విస్మరించారని, ఐదేళ్ల పాలనలో ఆధార్ కార్డు కూడా లేనివాళ్లు, అర్హత ఉన్నవారికి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాల అమలతో ప్రజలను ఆదుకుంటూ అండగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మండల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:తుఫాను బాదిత కుటుంబాలకు అండగా నిలిచిన ఎన్డీఏ ప్రభుత్వం)

