వాయిద్య కళాకారులను ఆదుకోవాలి..
డిజె సౌండ్స్ ను అరికట్టాలి..
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పట్టణం మున్సిపల్ కార్యాలయంలోని పార్కులో గుమ్మడి కళా పీఠం నియోజకవర్గం కమిటీ సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది.. ఈ సందర్భంగా జరిగిన సభలో గుమ్మడి కళాపీఠం ప్రధాన కార్యదర్శి దేవరపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ. రాష్ట్రవ్యాప్తంగా కళాకారులను ఏకం చేసి జనవరిలో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వ పెద్దలకు రాష్ట్రంలో ని కళాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించాలని తెలిపారు. కళాకారులు ఐక్యం కావలసిన సమయం ఆసన్నమైనదని, కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కళాకారులు ఇబ్బందులు తొలగించాలని ప్రజల ప్రాణాలను హరిస్తున్న డీజే లను రద్దుచేసి తద్వారా వాయిద్య కళాకారులకు అవకాశాలు ఏర్పాటు చేయాలని, మండలానికి ఒక కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు, భీమవరపు ఏడుకొండలు, నిడమనూరి వెంకట సుబ్బారావు, 5 మండలాల గుమ్మడి కళా పీఠం కార్యవర్గం పాల్గొన్నారు.(Story : వాయిద్య కళాకారులను ఆదుకోవాలి..)

