సర్దార్ పటేల్ కి నివాళులర్పించిన జీవీ
న్యూస్ తెలుగు/వినుకొండ : భారతదేశ ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయం నందు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జీవీ మాట్లాడుతూ. ఆయన నాయకత్వ లక్షణాలను, ఆశయాలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:సర్దార్ పటేల్ కి నివాళులర్పించిన జీవీ)
