పేద కుటుంబాలకు అండగా సీఎం సహాయ నిధి
న్యూస్ తెలుగు / వినుకొండ : సీఎం సహాయనిది పేదల పాలిటి పెన్నిదని ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 మంది లబ్ధిదారులకు, 26 లక్షల 73 వేలు చెక్కులను శుక్రవారం తన కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ పంపిణీ చేశారు. వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు, తమకు అందేలా కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ కి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. (Story:పేద కుటుంబాలకు అండగా సీఎం సహాయ నిధి)
