Home వార్తలు తెలంగాణ ఆయుధాల భద్రత, శిక్షణ, నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుధాల భద్రత, శిక్షణ, నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి

0

ఆయుధాల భద్రత, శిక్షణ, నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఆయుధాల తనిఖీ చట్టం ప్రకారం, వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం హైదరాబాద్‌ డిజిపి కార్యాలయం నుండి వచ్చిన డీఎస్పీ, శ్రీనివాసులు ఆయుధాల తనిఖీ బృందం వనపర్తి జిల్లా సాయుధ దళ పోలీసు కార్యాలయంలోని ఆయుధాలను సమగ్రంగా తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా ఆయుధాల సంరక్షణ, రికార్డుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, ఆయుధాల వినియోగ విధానాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించి, డీఎస్పీ, శ్రీనివాసులు గారు ఆయుధాల వివరాలు, రికార్డులు, భద్రతా చర్యలపై తనిఖీ వివరణ ఎస్పీ కి తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ….“ఆయుధాల భద్రత పట్ల ప్రతి సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయుధాల సంరక్షణ, వినియోగం విషయంలో చట్టపరమైన నిబంధనలు, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. ప్రతి సిబ్బంది తన విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాభావంతో వ్యవహరించటం ద్వారా మాత్రమే పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. సాయుధ దళం అనేది పోలీసులు వ్యవస్థకు బలమైన వెన్నెముక లాంటిది. క్రమశిక్షణ, ఏకత్వం, మరియు సమగ్రతతో విధులు నిర్వర్తించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం, భద్రతా భావం మరింత బలపడుతుంది. ఆయుధాల వినియోగంపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సిబ్బంది ప్రావీణ్యం, పనితీరు మరింత మెరుగవుతాయని తెలిపారు.“తనిఖీ బృందం అధికారులు వనపర్తి సాయుధ దళ పోలీసుల పనితీరు, ఆయుధాల సంరక్షణ విధానాలపై సంతృప్తి వ్యక్తం చేయడం గర్వకారణం. ఈ స్థాయి క్రమశిక్షణ, నిబద్ధత కొనసాగాలని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయుధ దళ అదనపు ఎస్పీ, వీరారెడ్డి,ఆయుధాల తనిఖీ బృందం అధికారి, ఏ ఆర్ డిఎస్పీ, శ్రీనివాసులు, వనపర్తి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్,తనిఖీ బృందం సిబ్బంది, ఏ ఆర్ ఎస్సై,రహమాన్, హెడ్ కానిస్టేబుళ్లు, వెంకట అప్పారావు,అరవింద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : ఆయుధాల భద్రత, శిక్షణ, నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version