Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి

0

ప్రజలకు అందుబాటులో ఉండాలి

న్యూస్ తెలుగు/సాలూరు : తుఫాను కష్టం తీరే వరకు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు తహసిల్దార్ కార్యాలయంలో మొంథా తుఫాన్ దృష్ట్యా సాలూరు, పట్టణ మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ మరియు మండలంలో లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయలన్నారు. నదీ తీర ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు బియ్యం ఎవరికి కావాలన్నా ఇవ్వండని ,అవసరమైతే నా సొంత నిధులిస్తానని చెప్పారు. పేదల ఆకలి తీర్చండని అన్నారు.పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు.పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పి మంచి భోజనం అందించాలని ఆమె సూచించారు. వై టీ సి భవనం లో ఉన్న గర్భిణులకు వైద్యం, పౌష్టికాహారం సరైన సమయంలో అందించాలని కోరారు.తుఫాను కష్టం తీరేవరకు అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని తెలియజేశారు.సాధ్యమైనంత వరకు ఇంటిలోనే ఉండండి.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ నీలకంఠేశ్వరరావు. ఎంపీడీవో పార్వతి, పట్టణ సీఐ అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్, అగ్రికల్చర్ ఆఫీసర్ కే శిరీష అధికారులు పాల్గొన్నారు.(Story :ప్రజలకు అందుబాటులో ఉండాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version