Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

న్యూస్ తెలుగు/వినుకొండ  :  ‘మోంత’ తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో, తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జివి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. తుఫాను కారణంగా సంభవించే ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తుఫాను సమయంలో ఎవరూ బయటకు రావొద్దని జివి ఆంజనేయులు ప్రజలను కోరారు. అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బంది ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు.తుఫాను తీవ్రత, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రభుత్వ చీఫ్ విప్ జివి ఆంజనేయులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.(Story : తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version