Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్న ఎం.ఎన్.ప్రసాద్

వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్న ఎం.ఎన్.ప్రసాద్

వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్న ఎం.ఎన్.ప్రసాద్

 న్యాయవాదులపై తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర

ఎం ఎం ప్రసాద్ అక్రమాలను ఖండించిన టీడీపీ

న్యూస్ తెలుగు/వినుకొండ  : వైసీపీనాయకుడు, లాయర్ ఎం.ఎన్.ప్రసాద్ తన వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్నారని ప్రముఖ న్యాయవాది, టిడిపి నాయకులు నల్లబోతు రామకోటేశ్వరరావు విమర్శించారు. ఇటీవల ఎంఎన్. ప్రసాద్ టిడిపి నేతలపై, కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు నిరాదారమైన ఆరోపణలు, విమర్శలను శనివారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ఎంతో ఖ్యాతి కలిగిన వినుకొండ గౌరవాన్ని మంటగలిపే విధంగా వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు పాలు పడుతున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో వినుకొండ ఇటువంటి పరిస్థితులు ఎన్నడూ లేవని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎం ఎన్ ప్రసాద్ లాంటివాళ్ళు వినుకొండ లో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన తగాదాలలో ఒక వ్యక్తి చనిపోతే అన్ని రాజకీయ పార్టీలు వెళ్లి సానుభూతి తెలిపాయని, ఎం ఎన్ ప్రసాద్ తప్పుడు కేసులు పెట్టించి రెచ్చగొట్టి జీవి, మక్కెన, పేర్లు ఇరికించే స్క్రిప్ట్ రాయించారని,ఇది ఎంతటి దుర్మార్గం అని అన్నారు. ఎం ఎన్ ప్రసాద్ టిడిపిలో ఉండి అక్రమాలు చేస్తున్నాడని ఖండిస్తే వైసీపీలో చేరి అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. వైసిపి పాలనలో ఎం ఎన్ ప్రసాద్ అనేక భూకబ్జాలు, అక్రమాలు, సెటిల్మెంట్లు, దందాలు చేశారని మార్కాపురం రోడ్డులో పట్టా వారి భూమి కాచేయడం వాస్తవం కాదా అని విమర్శించారు. అధికారం ఉందని తన అక్రమాలను ప్రశ్నించిన న్యాయవాదులపై కూడా తప్పుడు కేసులు పెట్టించారని అన్నారు. నువ్వు చేసిన అక్రమాలపై బార్ అసోసియేషన్ లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. టిడిపి నాయకులు పళ్ళ మీసాలు దాసయ్య మాట్లాడుతూ ఎం ఎన్ ప్రసాద్ ఐదు కోట్ల బిల్డింగు ఎలా వచ్చింది, నువ్వు ఏమైనా పిల్ల జమిందారా అని ఎద్దేవా చేశారు. మొదటినుంచి నీవు దోపిడీలు, దుర్మార్గాలు, అక్రమాలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. వెంకుపాలెం దారి వేముల కోటయ్య అతను పిల్లలకు సంబంధించిన భూమిని అక్రమంగా కబ్జా చేసావని ఆరోపించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రం, ట్రస్ట్, ఎన్టీఆర్, వర్ధంతి వేడుకలకు విరాళాలు సేకరించి కొన్ని దశాబ్దాలుగా దోచుకున్నావని విమర్శించారు. టిడిపి సీనియర్ నాయకులు లగడపాటి వెంకట్రావు మాట్లాడుతూ ఏబీఎమ్ ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఎస్సీల మధ్య వర్గాలు చేసి రెచ్చగొట్టడం దుర్మార్గమన్నారు. అనేక గ్రామాలనుండి 50 ఏళ్లుగా వినుకొండ వచ్చిన వారు ఎందరో ఏబీఎమ్ స్థలాల్లో నివాసం ఉంటూ స్థిరపడ్డారని, గత వైసిపి పాలనలో బొల్లా బ్రహ్మనాయుడు, అతని తోక ఎం ఎం ప్రసాద్ స్వార్థానికి నివాసితులను ఇబ్బంది పెట్టారన్నారు. అధికారంతో ఇల్లు కట్టుకునేందుకు వీలు లేకుండా చేసి అన్యాయం చేశారని అన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, బచ్చు అంజిరెడ్డి రోడ్డ వీరాంజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : వ్యక్తిగత సంపాదనకు అరాచకాలు సృష్టిస్తున్న ఎం.ఎన్.ప్రసాద్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!