వినుకొండ పట్టణ మాల మహానాడు కమిటీని ఎన్నుకొన్న కీర్తిపాటి వెంకటేశ్వర్లు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్ లోని మాల మహానాడు కార్యాలయంలో వినుకొండ పట్టణ మాల మహానాడు అధ్యక్షులు రాయని చిన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ పట్టణ ప్రచార కార్యదర్శిగా మేకల చెన్నయ్య ను పట్టణ మహిళా అధ్యక్షురాలుగా దారా రంగమ్మ కి నియామక పత్రాన్ని శనివారం వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పట్టణంలోని మాలలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని, మాలల సమస్యలపై ప్రతి ఒక్కరు ఏకమవ్వాలని ఉద్యోగ, విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇందులో భాగంగా సంవత్సరాల తరబడి కుంటుపడి ఉన్న స్మశాన సమస్యను పరిష్కరించే దిశగా మాలలు పోరాటం చేయాలని, మాలలను ఏకం చేస్తూ భవిష్యత్తు రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, వినుకొండ పట్టణ ఉపాధ్యక్షులు కొట్టే మనోజ్ కుమార్, కోశాధికారి పెనుమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story:వినుకొండ పట్టణ మాల మహానాడు కమిటీని ఎన్నుకొన్న కీర్తిపాటి వెంకటేశ్వర్లు)
