Home వార్తలు తెలంగాణ రోగులకు ఆప్యాయతతో సేవలు అందించాలి

రోగులకు ఆప్యాయతతో సేవలు అందించాలి

0

రోగులకు ఆప్యాయతతో సేవలు అందించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్ పేట మండలం సాకలిపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస రెడ్డి తండ్రి రామ్ రెడ్డి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నర్సింగ్ విద్యార్థులను పలకరించి నర్సింగ్ కోర్స్ ఎంచుకొని రోగులకు సేవలు అందించాలన్న ఆలోచనను అభినందించారు. రోగుల పట్ల ఆప్యాయంగా ఉంటూ సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమరి హయంలో ఎన్నో వైద్య, విద్యా సంస్థలు వచ్చి మాలో ఆత్మస్థైర్యం పెంచాయని అందుకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, జోహెబ్ హుస్సేన్, చంద్రశేఖర్, గన్నోజు మోహన్, నాగేంద్రం ఉన్నారు. (Story:రోగులకు ఆప్యాయతతో సేవలు అందించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version