మల్లేడ వాగు పై రాకపోకలు నిషేధం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ – అద్దంకి వయా ఉమ్మడివరం, పిట్టంబండ మధ్య గల మల్లేడ వాగు శనివారం కురిసిన వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపధ్యం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాకపోకలు నిషేధించి పలు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. మరియు పోలీసు మరియు రెవిన్యూ సిబ్బంది నీ జాగ్రత్త చర్యల నిమిత్తం ఉంచడం జరిగింది. పల్నాడు జిల్లాలో భారీ వర్ష సూచనలు జారీ చేసినందున ప్రతి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవటం జరిగింది.(Story : మల్లేడ వాగు పై రాకపోకలు నిషేధం )

