ఒడిస్సా పథకాలు తీసుకోవాలని గిరిజనులపై ఒత్తిడి
న్యూస్ తెలుగు/సాలూరు సెప్టెంబర్ 21 : వివాదస్పద కొట్టియా గిరిజన గ్రామాల్లో ఒడిస్సా అధికారులు పర్యటించి సంక్షేమ పథకాలు తీసుకోవాలని ఒత్తిడి వ్యతిరేకించిన దూళి భద్ర, ఎగువ సెంబి గ్రామ గిరిజనులు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన అంగనవాడి అధికారులు మాజీ ఎమ్మెల్యే జయరాం పాంగి సోదరుడు రజిత్ పాంగి గిరిజన గ్రామాల్లో తిరిగి గిరిజనులపై ఒడిస్సా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా గిరిజనులు వ్యతిరేకించి సంక్షేమ పథకాలు తీసుకోమని కరాకండిగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా దిగువ సెంబి గ్రామంలో గిరిజనులందరితో సమావేశం పెట్టి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా గిరిజనులు వ్యతిరేకిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మేము సంక్షేమ పథకాలు తీసుకోలేమని సరిహద్దు సమస్య పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు తాడంగి సన్నం చరణ్ చిరంజీవి కొమ్ములు సీతయ్య మర్రి మహేష్ తదితరు గిరిజనులు పాల్గొన్నారు(Story : ఒడిస్సా పథకాలు తీసుకోవాలని గిరిజనులపై ఒత్తిడి )

