Home వార్తలు తెలంగాణ పోలీసు అధికారులు, సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి

పోలీసు అధికారులు, సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి

0

పోలీసు అధికారులు, సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి

వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీరావుల గిరిధర్ అన్నారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు సిబ్బందికి జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి 10వ పట్టాలియన్ ఫైరింగ్ రేంజ్ లో ఈ ఏడాది పైరింగ్ ప్రాక్టీసు 3 రోజులు నిర్వహించారు. ఈ ఫైరింగ్ ప్రాక్టీసులో పోలీసులు వారి విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీసులో చేయించారు. ఒక్కొక్కరికి పది రౌండ్లు చేసే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ గారు, వనపర్తి జిల్లా సాయిదలాల అదనపు ఎస్పీ జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. జిల్లా ఎస్పీ పైరింగ్ ప్రాక్టీసులో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. అదేవిధంగా పైరింగ్ లో ప్రతిభను కనబర్చిన పోలీసు అధికారులు,సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది, విధినిర్వహణలో వినియోగించే ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలని ఆదేశించారు. సమయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించాలి. చెడు అలవాట్లకు లోనుకాకూడదు అన్నారు. పోలీసులు మంచిజీవన విధానాన్ని అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని వనపర్తి జిల్లాకు, తెలంగాణ పోలీసుశాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు.
ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడువ్యసనాలకు,చెడు స్నేహాలకు అలవాటుపడి, విధులలో నిర్లక్ష్యంతో, పోలీసుశాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలని ఎస్పీ గారు సూచించారు .
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు, వినోద్, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story:పోలీసు అధికారులు, సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version