Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విప్లవస్ఫూర్తితో నిర్వహించండి

పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విప్లవస్ఫూర్తితో నిర్వహించండి

0

పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విప్లవస్ఫూర్తితో నిర్వహించండి

సిపిఐ మావోయిస్టు పార్టీ

న్యూస్ తెలుగు/చింతూరు : ఈనెల 21 నుండి 27 వరకు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విప్లవస్పూర్తితో నిర్వహించాలని మావోయిస్టు పార్టీ బ్యానర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత్ర పురం గ్రామ శివారులలో శనివారం మావోయిస్టు పార్టీ బ్యానర్లు వేశారు. పార్టీని, పీపుల్స్ లిబరేషన్ గేరెల్లా ఆర్మీ (పి ఎల్ జి ఏ ) ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని పోస్టర్ లో పేర్కొన్నారు. అలాగే విప్లవ ప్రతిఘాధిక ” కగార్ ” యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజా రాసులను వర్గ పోరాటంలో, గిరిల్లా పోరాటంలో సమీకరిద్దామని, శత్రువుకు అభేద్యం గా పార్టీని తీర్చిదిద్దుకొందామని,విప్లవొద్యమ వెనకంజస్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందామని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులకు, పి యల్ జి ఎ, బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, ప్రజానీకానికి,సి పి ఐ (మావోయిస్టు ) కేంద్ర కమిటీ బ్యానర్లో పిలుపునిచ్చింది. (Story:పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విప్లవస్ఫూర్తితో నిర్వహించండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version