Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులను అక్రమంగా అరెస్ట్ చేసిన‌ పోలీసులు

ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులను అక్రమంగా అరెస్ట్ చేసిన‌ పోలీసులు

0

ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులను అక్రమంగా అరెస్ట్ చేసిన‌ పోలీసులు

న్యూస్ తెలుగు /సాలూరు : గిరిజన శాఖ మంత్రి ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులను సాలూరు పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్పెషల్ డిఎ‌స్సీ సాధన కమిటీ నాయకులను కూడా అరెస్ట్ చేశారు మంత్రి సంధ్యారాణి ఇచ్చిన మాట తప్పారని వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ 3 ని పునరుద్దించాలని గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కి గిరిజన నిరుద్యోగ యువకులు చేపట్టిన మంత్రి సంధ్యారాణి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని సాలూరు పోలీసులు భగ్నం చేశారు. సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ పట్టణ సిఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పాడేరు,ఆరుకు ప్రాంతాల నుంచి ఆదివాసీ స్పెషల్ డిఎ‌స్సీ సాధన కమిటీ మంత్రి ఇంటి ముందు నిరసన తెలియజేయడానికి వచ్చిన గిరిజన నిరుద్యోగ యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణ మంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు.స్పెషల్ డిఎస్సీ సాధన కమిటీ నాయకులు సాగిన ధర్మన్న పడాల్ సహా 20మంది నిరుద్యోగ యువతీ యువకుల ను పోలీసులు అరెస్టు చేశారు.వీరిని సాలూరు రూరల్,టౌన్,పాచి పెంట పోలీసు స్టేషన్ తరలించారు.ముందుగా దొరికిన 15మంది నిరుద్యోగ యువకులను పోలీసు స్టేషన్ లకు తరలించగా మిగిలిన మరో ఐదుగురు గిరిజన నిరుద్యోగ యువకులు పాతహెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వైపు నుంచి మంత్రి నివాసానికి వెళ్ళే రహదారి లో నినాదాలు చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ డిఎ‌స్సీ సాధన కమిటీ నాయకులు రాజు విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన నిరుద్యోగ యువకులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.ఆదివాసీ స్పెషల్ డిఎ‌స్సీ నిర్వహిస్తామని,జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం నమ్మకద్రోహం చేసినట్లు చెప్పారు.మెగా డిఎస్సీ లో గిరిజన యువతకు 2వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కేటాయించినట్లు గిరిజనులకు ఆమె వాగ్దానం ఇచ్చారని ఈ డీఎస్సీలో నిజమైన గిరిజనులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి గిరిజనులను మోసం చేస్తే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.(Story:ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులను అక్రమంగా అరెస్ట్ చేసిన‌ పోలీసులు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version