Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

 మహిళల అభ్యున్నతే టిడిపి ద్యేయం
మహిళలకు ఆర్థిక భారం తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం 
మంత్రి గొట్టిపాటి..  చీఫ్ విప్ జీవి.. మహిళా కమిషన్ చైర్మన్ శైలజ
న్యూస్ తెలుగు /వినుకొండ :రాష్ట్రంలో మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అయిన నేపథ్యంలో బుధవారం వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్ లోని గంగినేని కళ్యాణ మండపంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సూపర్ సిక్స్- సూపర్ హిట్” స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, విశిష్టాధితులుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని రాజకుమారి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలకు రుణాల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన 51.75 కోట్ల రూపాయల మెగా చెక్కును, 5 కోట్ల రూపాయల స్త్రీ నిధి చెక్కులను నేతల చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలంలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆడబిడ్డలను ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకువెళ్లి వాళ్ళ కాళ్లపై వాళ్లు నిలబడి వ్యాపారాలు చేసుకొని ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారని అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో సక్సెస్ అయిన విధంగా ఏ రాష్ట్రంలో లేదని స్పష్టం చేశారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు సౌకర్యం ఎలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషి ఎనలేనిదన్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు మరింత సౌకర్యంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 వేల ఎలక్ట్రికల్ బస్సులను సిద్ధం చేస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఏడాది కాలంలో 23 వేల ఉద్యోగాలు నిరుద్యోగులు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి దిశగా పయనిస్తా ఉంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు విషం చిమ్మటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసిపి చేస్తున్న ప్రచారం అవాస్తమన్నారు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 2014-19 లో చంద్రబాబు నాయుడు మిగులు విద్యుత్ని అప్పజెప్పిపోతే అసమర్థ వైసిపి పాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలను దోచుకుని అరాచక పాలనతో రాష్ట్ర అభివృద్ధిని 20 ఏళ్లకు వెనక్కి నెట్టారని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సగం హక్కు కల్పించాలని, ఆయన స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత సాధించేలా స్త్రీ శక్తి పథకం ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రతి మహిళ ఆర్థికవేత్త కావాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని, వెలుగు సంఘాల ద్వారా మహిళా సంఘాలను ఏర్పాటుచేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందన్నారు. శ్రీ శక్తి పథకం ద్వారా వినుకొండ నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది మహిళలు వినియోగించుకోవడం జరిగిందని, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెలకు 2500 కోట్లు ఖర్చు చేసి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి గుట్కామయం చేయడమే కాక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. ఏడాదిన్నర కూటమిపాలనలో రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే కాక మహిళా అభివృద్ధికి చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు అన్నారు. సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకు రెండు కళ్ళుగా భావిస్తారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. పథకాల అసాధ్యమని ప్రతిపక్షాలు హేళన చేసిన అవన్నీ అమలు చేయడంతో నేడు సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అయ్యాయని ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పి -4 ద్వారా స్వశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి ఆధ్వర్యంలో 100 పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. వినుకొండకు శాశ్వతంగా తలనీటి సమస్యను పరిష్కరించడంతోపాటు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు, ఎన్ఎస్పి స్థలంలో టిటిడి కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ గోనుగుంట్ల లీలావతి లు మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం మహిళల్లో ఆదాయం గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి మహిళకు 1500 నుండి 3000 వరకు ఆదాయం అవుతుందని అందుకు మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని మహిళలు గౌరవంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు మహిళలు వేలాదిగా తరలివచ్చారు. తొలిత నరసరావుపేట రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద నుండి మహిళలు ర్యాలీ నిర్వహించారు. సభ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని మహిళా కమిషన్ చైర్మన్ శైలజ ప్రారంభించగా, మంత్రి గొట్టిపాటి రవి బీపీ చెక్ చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు 70 రకాల పరీక్షలు నిర్వహించారు. సభా ప్రాంగణంలో 15 మంది గర్భవతులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు – లీలావతి దంపతులు సీమంతాలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్ ఏర్పాటుచేసిన కేకును నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, బిజెపి నాయకులు మేడం రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. (Story:”మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!