విశ్వకర్మలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని బుధవారం వనపర్తి పట్టణంలోని శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నిర్వాహకులు ఆయనను ఆలయ సంప్రదాయం ప్రకారం ఆహ్వానించి పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… అనాదిగా సమాజ మనుగడకోసం విశ్వకర్మల చేతివృత్తులు ప్రధాన భూమిక పోషించాయని యాంత్రిక ప్రపంచీకరణ నేపథ్యంలో వీరి కులవృత్తులకు ప్రాధాన్యత తగ్గి జీవనోపాధికి ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.ఈ సమస్యలను అధిగమించాలంటే తమ పిల్లలు గొప్పగా చదువుకునేందుకు ప్రోత్సహించాలని,అంతేగాక తాము సంపాదించిన సొమ్మును భూమి కొనుగోలు చేయడం వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని సూచించారు.ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ సంస్కారవంతమైన జీవనాన్ని సాగించాలి తెలిపారు.అనంతర దేవాలయ కమిటీ,స్వర్ణకార సంఘం,బులియన్ మర్చంట్ ప్రతినిధులు ఎస్పీని ఘనంగా సన్మానించారు.వివిధ రంగాలలో ప్రతిభను సాధించిన కళాకారులను,దేవాలయ, విశ్వబ్రాహ్మణ అభివృద్ధికి కృషిచేసిన వారిని ఎస్పీ శాలువా పూలమాలలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డా.పోతేదారు యాదాచారి, దర్శనోజు సత్యనారాయణ, వేణు,మాజీ కౌన్సిలర్, బ్రహ్మం ,బైరోజు చంద్ర శేఖర్, డా. శ్యాంసుందర్, కొండోజు గోపినాథ్, నారాయణదాసు గోవర్ధనాచారి, చెన్నయ్య ఆచారి, వీరాచారి,కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:విశ్వకర్మలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి)

