Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 10 కోట్ల తో కోల్డ్ స్టోరేజ్ శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు రవి

10 కోట్ల తో కోల్డ్ స్టోరేజ్ శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు రవి

0

10 కోట్ల తో కోల్డ్ స్టోరేజ్ శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు రవి

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గం, ఈపూరు గ్రామంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రూ.10 కోట్లతో నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజ్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ విడమలపాటి హనుమయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కోల్డ్ స్టోరేజ్‌ల పాత్ర ఎంత కీలకమో రవి వివరించారు. ఈ కోల్డ్ స్టోరేజ్ ద్వారా ఈపూరు, చుట్టుపక్కల గ్రామాల రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం ద్వారా మంచి ధర లభించినప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇది రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుందని అన్నారు. జీవీ మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు నాయకులు, రైతులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(Story :10 కోట్ల తో కోల్డ్ స్టోరేజ్ శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు రవి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version