Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నూతన బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి..

నూతన బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి..

నూతన బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి..

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని నరసరావుపేట రోడ్డు, ఎన్ఎస్పి కాల్వకట్ట వద్ద శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన నూతన బస్సు షెల్టర్ ను బుధవారం నాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు , రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ రాయపాటి శైలజ , శివశక్తి ఫౌండేషన్ చైర్ పర్సన్ గోనుగుంట్ల లీలావతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ. ప్రజలకు శివశక్తి ఫౌండేషన్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ప్రజల ప్రయోజనార్థం శివశక్తి ద్వారా బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడం చేయటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, యార్లగడ్డ లెనిన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. (Story:నూతన బస్సు షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవి..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments