పోలీసుల అత్యుత్సాహంతో ఆందోళన: శ్రీరామ్
న్యూస్‌తెలుగు/ వనపర్తి: వనపర్తి పట్టణ పోలీసుల అత్యుత్సాహం వల్ల కార్మికులు ఆందోళన చెందారని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అన్నారు. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ హైదరాబాదులో ఎలాంటి ఆందోళనకు పిలుపు లేనప్పటికీ అత్యుత్సాహంతో వనపర్తి జిల్లా జనరల్ ఆస్పత్రి లో విధుల్లో ఉన్న ఏఐటియుసి మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు నరసింహ రాజేష్ కుమార్ బాలకృష్ణ శ్రీకాంత్, కార్మికులను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్కుతరలించాలన్నారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనకు గురయ్యారన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళన పిలుపు ఉన్నప్పుడు కనీసం ఉన్నత స్థాయి నాయకులతో సమాచారం కన్ఫామ్ చేసుకోవాలని సూచించారు.(Story:పోలీసుల అత్యుత్సాహంతో ఆందోళన: శ్రీరామ్)
