Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆదివాసి నాయకపోడు గిరిజనులు జరుపుకునే కొత్త లు పండుగ

ఆదివాసి నాయకపోడు గిరిజనులు జరుపుకునే కొత్త లు పండుగ

ఆదివాసి నాయకపోడు గిరిజనులు జరుపుకునే కొత్త లు పండుగ

న్యూస్ తెలుగు/చింతూరు : పూర్వీకుల కాలం నుంచి తాతా ముత్తాతల కాలం నుంచి ఆదివాసి నాయక పోడు గిరిజనులు రాజుల స్వామివారిని కులదైవాలుగా కొలుస్తూ కొలుపులు చేయటం ఆ నావాయితీ ఇది ఆదివాసీ నాయకపోడు గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయం… ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల రెండవ వారంలో ఆదివాసి నాయకపోడు తెగవారు జరుగుతూనే కొత్త లు ఈ సందర్భంగా ఆదివాసీ నాయక పోడు కులదైవాలైనటువంటి రాజుల స్వామివారి వెండి ఆభరణాలు గొడుగులను రాజుల స్వామివారి పూజారి సార పాండురాజు ఇంటి వద్ద నుంచి రేఖపల్లి శివారులో గల కొలుపులు చేసే గద్దెలు రాజుల స్వామివారి నగిరి వద్దకు తీసుకువెళ్లి అక్కడ పూజారులు ఆ యొక్క వెండి ఆభరణాలను శుద్ధిచేసి చేసి బూరుగు చెట్టు వద్ద అలంకరించి పూజలు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు ఇది ఆదివాసీ నాయకపోడు కుల ఆచారం పూర్వీకుల కాలం నుంచి తరతరాలుగా ఆదివాసీ నాయకపోడు గిరిజనులు రాజుల స్వామి వారిని కులదైవాలుగా కొలుస్తూ కొలుపులు చేస్తూ ఉంటారు దీనిలో భాగంగా ఈ యొక్క కొత్తలను ఈరోజు జరుపుకోవడం జరిగినది… ఈ సందర్భంగా రాజుల స్వామివారి పూజారి సారా పాండురాజు రేకపల్లి గ్రామ కుల పెద్ద చిక్కాల బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకు ఒక్కసారి రాజుల స్వామివారి కొలుపులు అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా రేకపల్లి గ్రామస్తులు గ్రామ పెద్దలు కొలుపులు చేస్తారని ఈ యొక్క కార్యక్రమంలో భక్తులంతా కూడా వేల సంఖ్యలో పాల్గొంటారని అన్ని సామాజిక వర్గాల వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే పెద్ద పండుగని ఈ యొక్క వ్యవహారమంతా మా పూర్వీకుల కాలం నుంచి వస్తుందని ఇలా చేయడం వల్ల గ్రామ ప్రజలు పాడి పంటలు మంచిగా పండి ప్రజలంతా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉంటారని మా యొక్క నమ్మకమని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాజుల స్వామివారి పూజారి సార పాండురాజు సారా చిట్టెమ్మ గ్రామ కుల పెద్దలు చిక్కాల బాలకృష్ణ వేటకాని రాములు బేతి సారయ్య సారా నరసింహారావు,బేతి నాగేశ్వరరావు, కొట్టి ముత్యాలరావు, బేతి తిరుపతిరావు కొల్లుబోయన కన్నం రాజులు, గణాసారులు బాగుల సాంబయ్య కల్లి సాయిబాబు కొల్లుబోయిన రాజేశ్వరి పిట్లా పెంటయ్య కొల్లుబోయిన వీరబాబు గ్రామస్తులు మహిళా భక్తులు బుద్దా మాధవి బేతి సరళమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story : ఆదివాసి నాయకపోడు గిరిజనులు జరుపుకునే కొత్త లు పండుగ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!