దళిత రణభేరి కరపత్రాల ఆవిష్కరణ
న్యూస్ తెలుగు /వినుకొండ :
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణభేరిని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి నాగ వంశీ అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న విజయవాడలో జరిగే దళిత రణభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి నాగ వంశీ పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వై.సీ.పీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దళితుల మీద దాడులకు నిరసనగా చేస్తున్న ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం నుండి వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్రా వెంకటయ్య , పట్టణ నాయకులు పూనూరి జాన్సన్ , మరియు నూనె అఖిల్ , ప్రేమ్ కుమార్, పాలేటి ఇజ్రాయిల్, తదితరులు పాల్గొన్నారు. (Story:దళిత రణభేరి కరపత్రాల ఆవిష్కరణ)
