Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలతో ములాఖాత్ అయిన మాజీ ఎమ్మెల్యే

సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలతో ములాఖాత్ అయిన మాజీ ఎమ్మెల్యే

0

సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలతో ములాఖాత్ అయిన మాజీ ఎమ్మెల్యే

న్యూస్ తెలుగు /వినుకొండ : నరసరావుపేట సబ్ జైల్లో వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను శనివారం వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ. వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా 307 కేసులు నమోదు చేసి, కోర్టు ద్వారా రిమాండ్ విధించటం దారుణమన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. శావల్యాపురం మండలం కారుమంచి గ్రామ వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలిచి తప్పుడు కేసులకు ప్రతిఘటనగా నిలవాలని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గంలో ప్రతిచోట టిడిపి అరాచక పాలన కొనసాగిస్తుందని త్వరలోనే ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున ఆయన భరోసా కల్పించారు. (Story:సబ్ జైల్లో ఉన్న కార్యకర్తలతో ములాఖాత్ అయిన మాజీ ఎమ్మెల్యే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version