Homeటాప్‌స్టోరీ 'ఓజీ' నుండి 'ఓమి ట్రాన్స్' విడుదల

 ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల

 ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘ఓజీ’ చిత్రం నుండి విడుదలైన ‘ఓమి’ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ‘ఓజీ’ చిత్ర బృందం, ‘ఓమి ట్రాన్స్’ యొక్క పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. ‘ఓజీ’, ‘ఓమి’ల ముఖాముఖి పోరుని సూచించేలా ఈ గీతముంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మి మధ్య భీకర పోరాటం అద్భుతంగా ఉంటుంది.

ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్ తో సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ‘ఓమి ట్రాన్స్’ ఎంతో శక్తివంతంగా ఉండి, నిజంగానే శ్రోతలను ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సంచలనస్పందన రాగా, తాజాగా విడుదలైన ఈ గీతం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా సినిమాపై అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా ఉంది.

‘ఓజీ’ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ‘ఓజీ’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సామాన్య ప్రేక్షకులతో పాటు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఇక ఈ చిత్రానికి ఎటువంటి ప్రచారం అవసరం లేదని అంటున్నారంటే.. ‘ఓజీ’పై ఏ స్థాయి అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. అభిమానుల నుండి వాణిజ్య విశ్లేషకుల వరకు, అందరూ ‘ఓజీ’ చిత్రాన్ని 2025లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటి అని అభివర్ణిస్తున్నారు.

దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న ‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉన్నారు.

‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పుడు ‘ఓమి ట్రాన్స్’తో బాక్సాఫీస్ గర్జనకు కౌంట్‌డౌన్ మొదలైంది. త్వరలోనే ‘ఓజీ’ తుఫాను చూడబోతున్నాం. ఇది నిజమైనది, ఆపలేనిది, ఏకగ్రీవమైనది మరియు అత్యంత భారీది.

తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్ (Story: ‘ఓజీ’ నుండి ‘ఓమి ట్రాన్స్’ విడుదల)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!