ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేస్ వర్కర్స్ యూనియన్ (సి ఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 12 నుండి సమ్మె రెండు రోజులుగా సాగుతుంది సమ్మెలో భాగంగా వనపర్తి జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాల హాస్టల్ వర్కర్స్ రెండు రోజులుగా ఈ సందర్భంగా సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు పాల్గొని మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ పార్ట్ టైం కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న వర్కర్స్ కు 9 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి జిల్లాలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇదికి కనీసం సౌకర్యాలు లేవు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వం వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని 11500 రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నారు కనీస వేతనం 26000/- రూపాయలు ఇవ్వాలని 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయాలి ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి పూర్తిగా పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలి 12 నెల వేతనం చెల్లించాలి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు ఇవ్వాలని వేతనంతో కూడిన వారాంతపు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కృష్ణమ్మ రాజు చెన్నకేశవులు పార్వతమ్మ పద్మ వెంకటమ్మ సక్రి తదితరులు పాల్గొన్నారు.(Story :ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి )

