Home వార్తలు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలి

సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలి

0

సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 17 వరకు నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలనిసిపిఐ నేతలు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ తదితరులు వనపర్తి ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చరిత్రలో మహోజ్వల ఘట్టమన్నారు. భూమికోసం భుక్తకోసంసం వెట్టి చాకిరి, నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందన్నారు. గ్రామాల్లో ప్రజలను పీడిస్తున్న నిజాం తాబేదారులైన దొరలను తరిమికొట్టి 3000 గ్రామాలను విముక్తం చేసి ఎర్రజెండాలు పాతారన్నారు. 10 లక్షలు ఎకరాల భూమిని పేదలకు పంచారని ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య తో సహా 4,500 మంది అమరులయ్యారన్నారు. నాటి పోరాటానికి సిపిఐ అగ్ర నేతలు రావి నారాయణరెడ్డి, మగ్దుం మైనుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి తదితరులు నాటి పోరాటానికి నాయకత్వం వహించారు అన్నారు. సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్టులు మాత్రమే వారసులన్నారు. కానీ బిజెపి దాన్ని హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించే కుట్ర చేస్తోందని, నాటి పోరాటంలో వారి పాత్ర ఏమీ లేదని ప్రజలకు వివరించి తిప్పి కొట్టాలన్నారు. బిజెపి అబద్దాలను ప్రజల్లో తీసుకువెళ్లేందుకు, నాటి పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు వనపర్తి జిల్లాలో ఈనెల 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జరపాలని సిపిఐ నిర్ణయించిందన్నారు. గ్రామాలకు వెళ్లి నాటి పోరాటా స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేందుకు వస్తున్నామని ప్రజలు పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సీఎన్ శెట్టి, ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు.(Story : సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version