సెన్సిబుల్ లవ్‌స్టోరీ ‘చాయ్ వాలా’
ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ గురువారం రోజున తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. ప్రేయసిపై గుండెలనిండా స్వచ్చమైన ప్రేమను నింపుకున్న హీరో తన భావాలను అందంగా ఈ పాట రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
హీరో శివ కందుకూరి స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ తేజు అశ్విని బ్యూటీతో చూపులు తిప్పుకోనీయటం లేదు. ఈ మెలోడీలో రొమాంటిక్ మూమెంట్స్ విజువల్ ట్రీట్‌లా ఉంది. పాట అందరూ పాడుకునేలా ఉంది. కపిల్ కపిలన్ గొంతు నుంచి వచ్చిన ఈ పాట మరింత మాధుర్యంగా అనిపిస్తోంది. ప్రేమించేవాళ్లకు, మ్యూజిక్ లవర్స్‌కు ఈ పాట బాగా కనెక్ట్ అవుతుంది.
ప్రమోద్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ నర్వ ఎడిటర్.(Story:సెన్సిబుల్ లవ్‌స్టోరీ ‘చాయ్ వాలా’ )
