పేద కుటుంబాలకు ఆర్థిక సాయం
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు నిరుపేద 5 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన సినీ నిర్మాత, రాష్ట్ర తెలుగు యువత నాయకులు లగడపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం వారి కార్యాలయం నందు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ అని, నిరంతరం సేవా దృక్పథంతో ప్రయాణించే పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నిర్వాహక కార్యదర్శి షేక్ జానీ, బీసీ నాయకులు పల్లపు పున్నయ్య, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్, టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి కొమ్ము మరియా బాబు, వల్లేపు గోపి, తదితరులు పాల్గొన్నారు.(Story : పేద కుటుంబాలకు ఆర్థిక సాయం )
