మానవీయ విలువల ప్రతిబింబం కూటమి ప్రభుత్వం
నేపాల్ బాధితుల్ని కాపాడడంలో మంత్రి లోకేష్ చొరవ అభినందనీయం
ప్రజల పట్ల బాధ్యత, సంక్షేమ దృక్పథానికి ఇదే నిదర్శనం
న్యూస్ తెలుగు/వినుకొండ : నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో అక్కడ చిక్కుకు పోయిన తెలుగువారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంలో చొరవ కూటమి ప్రభుత్వం మానవీయ విలువలకు ప్రతిబింబంగా చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేపాల్‌లోని తెలుగు వారిని రక్షించి, స్వదేశానికి తిరిగి తీసుకువచ్చే చర్యలు వేగంగా, సమర్థంగా జరుగుతున్నాయని అన్నారు. గురువారం ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు పత్రికాప్రకటన విడుదల చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం నేపాల్‌లో చిక్కుకున్న వారిని తీసుకురావటానికి ఇలాంటి ప్రయత్నం చెయ్యలేదని, ఏపీ నుంచి కూటమిప్రభుత్వమే ఈ విధంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రజల పట్ల బాధ్యత, సంక్షేమ దృక్పథానికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకుని మరీ అమరావతిలోని ఆర్టీజీఎస్ ఆఫీస్‌కు చేరుకుని ఎప్పటికప్పుడు సమీక్షించడం, ప్రభుత్వం దిల్లీలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం ద్వారానే తక్షణ ఉపశమనం అందించగలిగామన్నారు. ఆయన స్వయంగా బాధితులతో ఫోన్‌లో మాట్లాడి, వివరాలు తీసుకుని అధికారులతో సమన్వయం చేయడం, దిల్లీలోని ఏపీభవన్‌లో అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు, నీరు, ఆహారం, వసతి వంటి విషయాల్లో శ్రద్ధపెట్టడం పట్ల బాధిత కుటుంబాలు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాయని అన్నారు. ఈ ఏర్పాట్లతో ఇప్పటికే 22మంది ఏపీవాసులు భారత్‌కు చేరుకున్నారని, మరో 133మందిని ఇళ్లకు తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 215మంది తెలుగువారిని క్షేమంగా తరిలించేందు ప్రభుత్వం అన్నివిధాలుగా పని చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా, వారి రక్షణ, సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి చిక్కుకుని పోయిన వారి, కంబోడియాలో ముఠాల బారిన పడిన వారిని ఇలానే వాట్సాప్ కాల్‌తో మంత్రి లోకేష్ కాపాడి స్వస్థలాలకు చేర్చారని తెలిపారు. గతంలోనూ తెలుగువారు ఉత్తరాదిన వరదలు, విపత్తుల్లో చిక్కుకున్నప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వారి కోసం ప్రత్యేక విమానాలు పెట్టి మరీ వాళ్ళ ఇండ్లకు చేర్చిందని గుర్తు చేశారు.(Story : మానవీయ విలువల ప్రతిబింబం కూటమి ప్రభుత్వం )
