Home టాప్‌స్టోరీ కట్కూర్..వాహ్! క్యా బాత్ హై

కట్కూర్..వాహ్! క్యా బాత్ హై

0

కట్కూర్..వాహ్! క్యా బాత్ హై

గ్రామ అభివృద్ధిలో కితాబిచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారుల బృందం

న్యూస్ తెలుగు/సిద్దిపేట ప్రతినిధి : గ్రామీణ ఆర్థిక,సామాజిక స్థితిగతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 25 మందితో కూడిన అధికార ప్రజాప్రతినిధుల బృందం బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ నేతృత్వంలో సిద్దిపేట జిల్లా ఇర్కోడుతో పాటు అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామాన్నీ సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఎంపీడీవో జయరాం నాయక్ వివరించారు.ఒక వైపు గ్రామానికి చెందిన 150 మంది యువత భారత సైన్యంలో చేరి దేశ సరిహద్దులో సేవలందించడంలో ఆదర్శనీయంగా రాణిస్తున్నారని, మరో వైపు పాలనలో ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా మండల పంచాయతీ అధికారి మోహన్ నాయక్,గ్రామ కార్యదర్శి స్వరూప విశేష సేవలందించిన తీరును అడిగి తెలుసుకున్న అధికార బృందం కట్కూర్.. వాహ్! క్యా బాత్ హై అని కితాబిచ్చారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. వీరితో పాటు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ కేంద్రం (టిజిఐఆర్డి) ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ కట్కూర్ గ్రామాన్నీ ఆదర్శనీయంగా కృషి చేసిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు జిల్లెల అశోక్ రెడ్డి, భూపతి ముకుందరెడ్డితో పాటు నాటి పాలకవర్గాన్నీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రజాప్రతినిధులు, సూపరిండెంట్ శంకరయ్య, ఎంపివో మోహన్, కట్కూరు గ్రామ కార్యదర్శి స్వరూప, సిబ్బంది వేల్పుల రాజు, మహిళ సమాఖ్య సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story:కట్కూర్..వాహ్! క్యా బాత్ హై)

ప్రత్యేక కథనం:
నారదాసు ఈశ్వర్ సీనియర్ జర్నలిస్ట్..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version