బొల్లా బ్రహ్మనాయుడు ని హౌస్ అరెస్ట్
వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరుకు వెళ్లకుండా అరెస్ట్ చేసిన పోలీసులు
రైతుల సమస్యలపై పోరాటానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసిన బొల్లా బ్రహ్మనాయుడు
కూటమి సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతుల సమస్యల పై పోరాటం ఆపమని తెలిపిన మాజీ ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవు కావున ఆ కార్యక్రమానికి మీరు వెళ్ళకూడదు అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కి నోటీసులు ఇచ్చి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి వెళ్తుంటే కూటమి ప్రభుత్వం ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత రాష్టం రావణకష్టం అయ్యిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఎండలో పడికాపులు కాస్తున్నారన్నారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు తలపైట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇలా అరెస్ట్ చేసి ఆపడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతులు, ప్రజలు పడుతున్న సమస్యలపై వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు.(Story : బొల్లా బ్రహ్మనాయుడు ని హౌస్ అరెస్ట్ )

