Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌దాడి చేయడం ఎదురు కేసులు పెట్టడమే వైకాపా పని

దాడి చేయడం ఎదురు కేసులు పెట్టడమే వైకాపా పని

దాడి చేయడం ఎదురు కేసులు పెట్టడమే వైకాపా పని

వినాయక నిమజ్జనంలోతాగొచ్చి గొడవ చేసి తలలు పగలగొట్టారు

విచారణకు వెళ్లిన పోలీసులపై కారం రోకళ్లతో దాడి చేశారు

అనారోగ్య మరణానికీ రాజకీయ రంగు పులుముతున్నారు

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గం శావల్యపురం కేంద్రంగా కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై సోమవారం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టిడిపి నేతలు కీలక వివరాలు వెల్లడించారు. టిడిపి వారిపై దాడి చేయడం, ఎదురు కేసులు పెట్టడమే వైకాపా నేతలకు పనిగా మారిందని, నిమజ్జనం రోజు కావాలని గొడవ చేసింది, తలలు పగలగొట్టింది, పోలీసులపై దాడి చేసింది కాక, గుండెపోటు మరణాన్ని కూడా రాజకీయం చేయడం వారికే చెల్లిందని మండిపడ్డారు. శావల్యాపురం మండల టీడీపీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు, కారుమంచి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ యర్రమాసు కోటేశ్వరరావుతో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా జీడీసీసీబీ ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గం ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కారుమంచిలో జరిగింది కప్పిపుచ్చుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రకరకాల కథనాలు అల్లుతున్నాడని మండిపడ్డారు. 2వ తేదీన ఇదే పోలీసుల సమక్షంలో వైకాపా వర్గం వారి నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, కానీ 4వ తేదీన తెలుగుదేశం వారి కార్య క్రమంలో ఘర్షణ జరగడం వెనక ఎవరున్నారో అందరికీ అర్థం అవుతుందన్నారు. కావాలని వైకా పా వర్గానికి చెందిన వారు మద్యం సేవించి కావాలని గొడవ చేశారు. సురేష్‌ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త తల పగల గొట్టారని తెలిపారు. ఆ పనిచేసిన వారిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపైనా కారం, రోకళ్లతో దాడి చేశారని, అనంతరమే పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా కేసులు పెట్టారని అన్నారు. ఆ క్రమంలో కొందరు తెలుగుదేశం వారిపైనా కేసులు నమోదయ్యాయని అయినా చట్టాన్ని గౌరవించి ప్రశాంతంగా ఉన్నామన్నారు. కానీ బొల్లా కావాలని దీనికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. పైగా 4వ తేదీన ఇదంతా జరిగితే 7వ తేదీన అనారోగ్యంతో ఒకరు చనిపోతే అది కూడా తెలుగుదేశం పని ఎలా అంటారని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి గుండె చికిత్స తీసుకుంటున్న విషయం కూడా అందరికీ తెలుసన్నారు. ఇదే కారుమంచిలో బొల్లా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ బొమ్మ విషయంలో గొడవ జరిగితే తెలుగుదేశం పార్టీ వారిని దారుణంగా కొట్టారని, తిరిగి బాధితులపైనే 307 కేసులు పెట్టి 15రోజులు జైల్లో ఉంచిన దుర్మార్గాలు చూశామన్నారు. నాడు దాడుల్లో తలలు పగిలినా, కళ్లు పోయినా తాము ఎప్పుడూ ప్రతీకారానికి పోలేదని గుర్తు చేశారు. చివరకు నాడు ఘటనపై పోలీసులు సీసీ కెమెరాలు చూసి నలుగుర్ని అరెస్ట్ చేస్తే బొల్లా వారిని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తీసుకుని వచ్చి కారులో ఊరిలో వదిలి పెట్టారని….. అది ఆరోజుల్లో ఉన్న శాంతిభద్రతల పరిస్థితి అన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి గురించి తప్ప వేరే ఆలోచన లేకున్నా బొల్లా బురద జల్లాలని చూడడం దుర్మార్గమన్నారు. ఎక్కడ ఏం జరిగినా చివరకు భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య గొడవ జరిగినా తెలుగుదేశం పార్టీ మీదనే వేస్తారు. పొలాల పంచాయితీలు, మద్యం మత్తులో గొడవలు ఇలా ఏం జరిగినా లోకేష్, రెడ్‌బుక్ రాజ్యాంగం అంటే ఎలా? అని చురకలు వేశారు. కారుమంచి టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రమాసు కోటేశ్వరరావు మాట్లాడుతూ. ఇక్కడ ఏ గొడవ జరిగింది అని సృష్టించడం కాకపోతే ఇక్కడేం జరగలేదన్నారు. నిమజ్జనం సందర్భంగా పెద్దలంతా దగ్గరే ఉండి ఎక్కడ గొడవలు లేకుండా కుర్రాళ్లను పంపించడం జరిగిందన్నారు. ప్రశాంతంగా సాగుతున్న నిమజ్జన యాత్రలో వైకాపా వాళ్లు తాగి వచ్చి గొడవ చేశారని, కావాలని కొట్టారు. సురేష్ తల పగలగొట్టారని తెలిపారు. బొల్లా బ్రహ్మనాయుడు ఆ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. శావల్యాపురం మండల టీడీపీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు మాట్లాడుతూ. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు తెలుగుదేశం వారిని పోలీస్‌ స్టేషన్ మెట్లు కూడా తొక్కని వ్వలేదని, ఏకపక్షంగా కేసులు పెట్టారని కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవన్నారు. పోలీసుల అనుమతి తీసుకుని చేసిన కార్యక్రమంలో కావాలనే చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్ గద్దె మస్తానురావు, సొసైటీ చైర్మన్ గడిపూడి విశ్వనాథం, కారుమంచి గ్రామ పార్టీ అధ్యక్షులు ముప్పా గిరి ప్రసాద్, పాల్గొన్నారు.(Story : దాడి చేయడం ఎదురు కేసులు పెట్టడమే వైకాపా పని )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!