శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ..
న్యూస్ తెలుగు /వినుకొండ :వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి బదిరుల పాఠశాల విద్యార్థులకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు శనివారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాల లోని 80 మంది పిల్లలకు ఫౌండేషన్ మేనేజర్ రమేష్, చేతుల మీదుగా నోట్ బుక్స్ అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించి వినుకొండ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. (Story:శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ..)

