Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర మాజీ విలేఖరి అబ్దుల్ సలాం మృతి

సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర మాజీ విలేఖరి అబ్దుల్ సలాం మృతి

సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర మాజీ విలేఖరి అబ్దుల్ సలాం మృతి

న్యూస్ తెలుగు/వినుకొండ  : సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ విలేఖరి పి.అబ్దుల్ సలాం ( 67 ) ఆదివారం రాత్రి మృతి చెందారు. సలాం కొన్ని మాసాలుగా అనారోగ్యంతో బాధపడుతూ వినుకొండలోని ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సలాం గతంలో వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం విశాలాంధ్ర విలేఖరిగా పనిచేశారు. ఆయన పని చేసిన కాలంలో బొల్లాపల్లి మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ గిరిజనులు, సుగాలీలు సమస్యలను తెలుసుకుంటూ. ఆ సమస్యలను అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళుతూ, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేశారు. సలాం మృత దేహాన్ని సోమవారం నాడు విశాలాంధ్ర విలేకరులతోపాటు పలు పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సందర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, సలాం మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది పిజె లూకా, తదితరులు సలాం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్, సలాం మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.(Story : సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర మాజీ విలేఖరి అబ్దుల్ సలాం మృతి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!