ప్రిన్సిపాల్ కు ఘన సన్మానం
న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సాయంత్రం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, ప్రిన్సిపాల్ కొండ్రు రమేష్ బాబు ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రసాయన శాస్త్ర అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు తీర్చి దిద్దడానికి ప్రిన్సిపాల్ సేవలను కొనియాడుతూ భవిష్యత్తు లో జాతీయ స్థాయిలో కూడా వారికి గుర్తింపు లభించాలని అభిలషించారు. వృత్తిని నిబద్ధతతో నిర్వహించి నిజాయితీగా ఉండే వ్యక్తి కొండ్రు రమేష్ బాబు అని కొనియాడుతూ వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పైకి ఎదగాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులను గురువును గౌరవించినవారు తప్పనిసరిగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సన్మాన గ్రహీత ప్రిన్సిపాల్ కొండ్రు రమేష్ బాబు అన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి మంచి స్థితిలో ఉండాలనే వారికొరిక నెరవేర్చి ఉత్తమ పౌరులుగా రూపొందాలని ఆయన ఉద్బోధించారు.నేటి బాలలే రేపటి పౌరులనీ వారు చదువుపై దృష్టి పెట్టి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యాభివృద్ధికి వినియోగించాలని రమేష్ బాబు పేర్కొన్నారు. ఇంకా అధ్యాపకులు సుశీల , భూలక్ష్మి, విజయలక్ష్మి, సాయి చంద్రిక, దుర్గాప్రసాద్, అప్పలనాయుడు, రాము, చంద్రశేఖర్, శివయ్య ప్రిన్సిపాల్ సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. కళాశాల విద్యార్థులందరూ ప్రిన్సిపాల్ రమేష్ బాబు ను శాలువాతో సత్కరించి ,పువ్వులతో గురుపూజోత్సవాన్ని ఆనందం, సంతోషంతో నిర్వహించి బాగా చదువుకొని కళాశాలకు మంచి ఫలితాలను అందించి ఋణం తీర్చుకుంటున్నారు.(Story : ప్రిన్సిపాల్ కు ఘన సన్మానం )

