Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విశ్వ సాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ

విశ్వ సాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ

విశ్వ సాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ

గురువందనంతో అష్టమ వార్షికోత్సవం

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక కారంపూడి రోడ్ లో బ్రహ్మనాయుడు కన్వెన్షన్ లో విశ్వసాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ గురువందనంతో ఎనిమిదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీడిసిసి బ్యాంక్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున, టిడిపి యువ నాయకులు పివి సురేష్, జీవీ రమణ రావు, జనసేన అధినేత నిశంకర శ్రీనివాస్, రిటైర్డ్ హెచ్ఎం బాగోతం రవికుమార్, అప్ప రాజు నాగేశ్వరరావు, నారాయణ రావు పాల్గొన్నారు. కళాశాల ఉద్దేశించి మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. విశ్వ సాయి జూనియర్ కళాశాల వినుకొండలో అత్యుత్తమ విద్యాబాధన చేయటంలో విద్యార్థులని సద్గుణ సంపన్నులుగా తీర్చిదిద్దటంల్లో ఉంటుందని, ఈ కళాశాలలో చదివే… కాదు సంస్కారం కూడా చక్కగా నేర్పిస్తున్నారని, ఈ విద్యార్థులను చూస్తే తెలుస్తుంది అని అన్నారు. గత సంవత్సరం కళాశాల విద్యార్థులు సాధించిన ర్యాంకులు రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా సాధించటం మనం వినుకొండ కి గర్వకారణం అన్నారు. ఇలాంటి కళాశాల మన వినుకొండలో ఉండటం ఎంతో వరమని, ఈ అధ్యాపకులు ఉత్తమమైన విద్యాబోధన చేయటం వల్లే ఈ ర్యాంకులు సాధ్యమని కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మ మరియు ప్రిన్సిపాల్ శ్రీవల్లి పావని చెప్పారు. తదుపరి కళాశాల ఉత్తమ అధ్యాపకులను సత్కరించడం జరిగింది. దీనిలో భాగంగా సీనియర్ ఆంగ్ల అధ్యాపకులు పోక హనుమంతరావు కి మరియు ఇతర అధ్యాపకు బృందానికి అధ్యాపకేతర బృందానికి కళాశాల యాజమాన్యం తరఫున సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచి ఉత్తమమైన నృత్యాలతో నాటకాలతో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. (Story:”విశ్వ సాయి జూనియర్ కళాశాల విజయోత్సవ సభ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments