చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
న్యూస్ తెలుగు / చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. తొలుత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.రత్న మాణిక్యం ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీ , విద్యార్థులను ఉద్ధ్యేశించి మాట్లాడుతూ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారని, రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి భారత దేశానికి రాష్ట్రపతి పదవి అలంకరించిన మహనీయుడన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి.శేఖర్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు బావి భారత పౌరులుగా తిర్చిదిద్దే భాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్.అప్పనమ్మ ,కె.శకుంతల,జి. హారతి,కె.శైలజ, ఎమ్. నాగమోహన్ రావు, ఆర్. మౌనిక,జి.సాయి కుమార్, బి.శ్రీనివాసరావు, ఎన్. ఆనంద్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం )
