పేదల వైద్యంలో సంజీవని… అందరికీ ఆరోగ్య బీమా
దేశానికే ఆదర్శం కానున్న ఏపీ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్
రైతుల ముసుగులో యూరియాపై జగన్, వైసీపీ దుర్మార్గపు ఫేక్ ప్రచారం: జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకు వస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట సంజీవని కానుందని చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. డబ్బు లేక చికిత్సలు అందుకోలని పరిస్థితుల్లో ఇకపై ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఇకపై ఉండవని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెడుతున్న క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ దేశానికే ఆదర్శంగా అవుతుందన్నారు. సుమారు 1.63కోట్ల కుటుంబాలు, 5కోట్లమంది ప్రజలకు ప్రయోజనం అందించనున్న అందరికీ ఆరోగ్య బీమా 100శాతం గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. రూ.25 లక్షల వరకు పరిమితి ఉండడం వల్ల ఇకపై ఖరీదైన వైద్య సేవలకు కూడా ఎవరు భయపడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్న జ్వరం నుంచి గుండె ఆపరేషన్లు, డయాలసిస్, కేన్సర్ చికిత్సల వరకు నూతన విధానంలో విస్తృత కవరేజీ అందిస్తారని, ఓ కుటుంబానికి అవసరమయ్యే దాదాపు అన్ని రకాల వైద్యలు ఇకపై ఉచితంగా లభిస్తాయని తెలిపారు. రాష్ట్రం మొత్తం దాదాపు 2,493నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో 3,257పైగా వైద్య సేవలు రూపాయి ఖర్చు పెట్టకుండానే అందుతాయన్నారు. ఆస్పత్రుల్లో చేరిన 6 గంటల్లోనే క్యాష్‌లెస్‌కు అనుమతులు ఇవ్వడంతో జాప్యం లేకుండా సేవల అందుబాటులోకి రానున్నాయని అన్నారు. వైద్య ఖర్చుల భారం మోయలేక అప్పులపాలవుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ పథకం అతిపెద్ద ఊరటనిస్తందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూటమి తరపున చెప్పి నవే కాక కొత్త పథకాలను కూడా ప్రభుత్వం అందిస్తోందనడా నికి ఇదే నిదర్శనమని చెప్పారు. అధికారంలోకి వచ్చింది మొదలు ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురదజల్లడమే జగన్, వైకాపా పనిగా పెట్టుకోవడం దుర్మార్గమని మండి పడ్డారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రైతుల ముసుగులో యూరిపై వారు చేస్తున్న ఫేక్ ప్రచారాల్ని ఎవరు నమ్మడం లేదన్న జీవీ అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, కేంద్రం కూడా సహకరిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం అదనంగా 53వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసిందని… ఆ నిల్వలు రైతులకు చేరేలోపు రాజకీయ లబ్ది కోసం జగన్, వైకాపా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.(Story:పేదల వైద్యంలో సంజీవని… అందరికీ ఆరోగ్య బీమా)
